Govt Employee: ఏపీ నుంచి తెలంగాణ ఉద్యోగుల రిలీవ్.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం అభ్యర్ధన పై ఏపీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అభ్యర్ధన పై ఏపీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. తెలంగాణ స్థానికత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన కొందరు ఉద్యోగులను ఏపీ కేడర్ కు కేటాయించడం జరిగింది. దీంతో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రాష్ట్రానికి పంపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధించింది. ఈ అభ్యర్ధనకు సుముఖత చూపిన ఏపీ ప్రభుత్వం 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. రిలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంకులోనే విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.