ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేయబోతున్నట్టు ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 9168 గ్రూప్ –4 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. టీఎస్ పీఎస్సీ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గతంలో గ్రూప్ –1 కింద 503, గ్రూప్ –2 కింద 663, గ్రూప్ –3 కింద 1373 పోస్టులకు కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్ –1 కు మాత్రమే టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన వాటిపై మార్పులు, చేర్పులపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కొన్ని పోస్టులను గ్రూప్ –2, 3 కిందకు చేర్చారు. గ్రూప్ –4 లో కూడా కొన్ని పోస్టులను కలిపారు. కానీ, గ్రూప్ –4 కింద జూలై వరకు గుర్తించిన పోస్టులకే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కొత్తగా మార్చిన పోస్టులను కలుపలేదు. టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో మొత్తం ఇప్పటి వరకు 2910 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఫైనాన్స్ నుంచి అనుమతి వచ్చింది. వార్డు ఆఫీసర్ల స్థానాల్లో 1862 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ స్థానాల్లో వీఆర్ఏ, వీఆర్ఏలను నియమించేందుకు పరిశీలించారు. కొన్నిచోట్ల వీఆర్ఓలను సర్దుబాటు చేశారు. ఇంకా 200కుపైగా పోస్టులను వీఆర్ఓలతో భర్తీ చేయాలని భావించారు. కానీ, ఈసారి ఆర్థిక శాఖ మాత్రం కొత్తగా వార్డు ఆఫీసర్ల పోస్టులకు ఆమోదం ఇచ్చింది.
గ్రూప్ –4 కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 191, జూనియర్ అసిస్టెంట్ 429, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ లో 238, జూనియర్ అసిస్టెంట్స్ 6859, వ్యవసాయ శాఖలో 44, పశు సంవర్థక శాఖలో 2, బీసీ వెల్ఫేర్ లో 307, సివిల్ సప్లైలో 72, ఎనర్జీ వింగ్ లో 2, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 23, ఫైనాన్స్ లో 46, జీఏడీలో 5, వైద్యారోగ్య శాఖలో 338, హయ్యర్ ఎడ్యుకేషన్ లో 742, పోలీస్ శాఖలో 133, పరిశ్రమల శాఖలో 7, ఇరిగేషన్ లో 51, కార్మిక శాఖలో 128, మైనార్టీ వెల్ఫేర్ లో 191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 601, పంచాయతీరాజ్ లో 1245, రెవెన్యూ శాఖలో 2077, ప్లానింగ్ లో 2, ఎస్సీ డెవలప్మెంట్ లో 474, సెకండరీ ఎడ్యుకేషన్ లో 97, రవాణా శాఖలో 20, ట్రైబల్ వెల్ఫేర్ లో 221, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18, టూరిజం అండ్ యూత్ డిపార్ట్మెంట్ లో 12, అడిట్ లో 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో వార్డు ఆఫీసర్ల భర్తీ కోసం 1862 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
Big announcement!
— Harish Rao Thanneeru (@trsharish) November 25, ౨౦౨౨
9,168 Group-IV vacancies be filled by Direct Recruitment through TSPSC#Telangana Govt under #CMKCR Garu, the leader who is serving & fulfilling the promises & wishes, accorded Permission for filling-up of such huge number of posts.
Best wishes to aspirants. pic.twitter.com/4YBgHRAp0qఉద్యోగ ఖాళీల వివరాల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి