రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఆ పథకానికి నిధులు మంజూరు
Government is good news for the people of the state.. Grant of funds for that scheme
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా భాగంగా ఈ నెల 27న ప్రారంభించబోయే రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై ప్రభత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పథకం అమలు కోసం రూ.80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించనట్లుగా తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను ఇప్పటికే ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.