Hyderabad Metro : మెట్రో రెండో ఫేజ్ పనులకు ప్రభుత్వ అనుమతులు మంజూరు
హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్(Hyderabad Metro 2nd phase) పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్(Hyderabad Metro 2nd phase) పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం ఐదుమార్గాల్లో మెట్రో రెండో దశ పనులు మొదలవనున్నాయి. ఐదు మార్గాల్లో 76.4 కిమీల పరిధిలో 8 కారిడార్లు నిర్మించనున్నారు. రెండో దశ మెట్రోకు రూ.24,269 కోట్ల వ్యయంగా కానుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 196 జీవోను జారీ చేసింది. అయితే ఈ దశలో 4వ కారిడార్లో నాగోల్ - శంషాబాద్. 5వ కారిడార్లో రాయదుర్గం - కోకపేట్. ఇక అతిముఖ్యమైన 6వ కారిడార్లో ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మార్గాలు ఉండనున్నాయి. కాగా ఇప్పటికే ఆయా మార్గాల్లో స్థలసేకరణకు మెట్రో రైల్ సంస్థ ప్రకటన కూడా జారీ చేసింది.