GOOD NEWS: ఫ్రీ కరెంట్‌పై ప్రభుత్వం భారీ శుభవార్త..!

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.

Update: 2024-07-12 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఇస్తామని దీనికి సంబంధించిన దరఖాస్తులను ప్రజాపాలన వేదికల ద్వారా ప్రభుత్వం తీసుకుంది. కానీ ఫ్రీ కరెంట్ పొందాలంటే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలని ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నట్లుగా లబ్ధిదారులు ఫ్రూవ్ అయితేనే ఫ్రీ కరెంట్ వర్తిస్తుందని సర్కారు తేల్చి చెప్పింది. లేనివారు వెంటనే అఫ్లికేషన్ చేసుకోవాలని సూచించింది. తాజాగా ఉచిత విద్యుత్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి గృహజ్యోతి స్కీం అందని వారు సర్కారు శుభవార్త అందించింది. లబ్ధిదారులు ఇళ్లు మారినప్పుడు.. రేషన్ కార్డు, యూనిక్ సర్వీస్ నంబరు అనుసంధానంలో లోపాల వల్ల ప్రయోజనాలు పొందలేనివారు వివరాలను సవరించుకునే చాన్స్ ఇచ్చింది. ఈ స్కీం కింద ఇప్పటివరకు అబ్ధిపొందని వాళ్లు కూడా రేషన్ కార్డు కలిగి ఉంటే సిటిజన్ సర్వీస్ సెంటర్లలో అఫ్లికేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 


Similar News