విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే వేసవి సెలవులు..!

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమయి.. ఈ రోజు(ఏప్రిల్11)న ముగిశాయి.

Update: 2023-04-11 11:44 GMT
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే వేసవి సెలవులు..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమయి.. ఈ రోజు(ఏప్రిల్11)న ముగిశాయి. అయితే 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ సబ్జెక్టులతో పరీక్ష రాసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాగా..ప్రధాన సబ్జెక్టుల ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడంతో పదో తరగతి విద్యార్థులకు రేపటి (ఏప్రిల్ 12) నుంచి ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల 13 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఈ సారి 6 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేయనుందట.

ప్రస్తుతం మొత్తం 12 కేంద్రాలు ఉండగా.. కొత్తగా 6 ఏర్పాటు చేయడంతో, 18కు చేరింది. సిద్దిపేట, మంచిర్యాల, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక సమ్మర్ సెలవుల్లో ప్రైవేట్ స్కూల్స్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎండల వల్ల ప్రభుత్వం మార్చి 15 నుంచే ఒంటి పూట బడి ప్రకటించడం జరిగింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని హెడ్ మాస్టర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అనంతరం ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. 

Tags:    

Similar News