TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎన్నికల వేళ 2 వేల ప్రత్యేక బస్సులు!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నుంచి జిల్లా ప్రయాణాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నుంచి జిల్లా ప్రయాణాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మే 13న ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నేడు, రేపు, ఎల్లుండి నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్ పూర్తయినట్లు సమాచారం.
ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనుంది. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు టీఎస్ ఆర్టీసీ నడుపనుంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రయాణికుల కోసం 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.