CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు రెండో విడత రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది.

Update: 2024-07-30 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు రెండో విడత రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 వేల కోట్లు జమ కానున్నాయి. మొదటి, రెండో విడత రుణమాఫీ నిధులు మొత్తం రూ.12,289 కోట్లను ఈ స్కీంకు ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు వెచ్చించినట్లయింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన రూ.లక్ష మాఫీ మిత్తికి కూడా సరిపోలేదన్నారు. గతంలో నిధులు ఉన్నా బీఆర్ఎస్ సర్కార్ రైతులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. రాహుల్, సోనియా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. కాగా, ఈనెల 19న తొలి విడతలో రేవంత్ సర్కారు సుమారు 10.83లక్షల కుటుంబాలకు చెందిన 11.34లక్షల అకౌంట్‌లలో రూ.6,035 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వారు, గవర్నమెంట్ ఎంప్లాయిస్, పింఛన్ దారును అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం ఇప్పటికే తొలిగించింది. 

Tags:    

Similar News