Godavari: మరోసారి పెరుగుతున్న గోదావరి వరద.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి గోదావరి నదికి భారీగా వరద పెరుగుతుంది.

Update: 2024-08-01 03:16 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి గోదావరి నదికి భారీగా వరద పెరుగుతుంది. గత రెండు రోజులుగా శాంతించిన నది 41 అడుగులు చేరగా.. తాజా పరిస్థితుల్లో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అదికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ చేస్తున్నారు. అలాగే పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు వరద పెరిగి..ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులగా నమోదైంది. ఇందులో పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 403.6 అడుగులకు చేరుకుంది. అలాగే తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 72.3మీటర్లు నమోదైంది. ప్రస్తుతం..ఇన్‌ఫ్లో 14,143 క్యూసెక్కులు వస్తుండగా.. 14,374 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


Similar News