HYD : భారీ వర్షం.. ఉద్యోగులకు GHMC కమిషనర్ కీలక సూచన
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వర్షాలు, ప్రజల ఇబ్బందులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలని కమిషనర్ సూచించారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని కమిషనర్ సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9లో నాలాపై రోడ్డు కుంగింది. నాలాపై రోడ్డు కుంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బల్కంపేటలో రైల్వే అండర్ పాస్ కింద వరద నీటిలో కారు మునిగిపోయింది.