వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి.
దిశ,వెబ్ డెస్క్: హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. గణేష్ నవ రాత్రులకు హైద్రాబాద్ సిద్ధమైంది. పట్టణంలో ఏ వైపు చూసిన గణేష్ విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. అన్నింటిలో ఖైరతాబాద్ గణేశుడు చాలా స్పెషల్. ఈ సారి దశమహా ఖైరతాబాద్ గణేశుడు విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు మరి కొద్దీ సేపటిలో తొలి పూజలు అందుకోనున్నాడు.