CM రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న మాజీ BRS ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మరోసారి ప్రశ్నల వర్షం గుప్పించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మరోసారి ప్రశ్నల వర్షం గుప్పించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు రూ. 100 కోట్ల లాభం వస్తుందని.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బులు దోచుకుంటారని రేవంత్ రెడ్డి అంటున్నారు.. మరి కోచింగ్ సెంటర్ నడిపిన రియాజ్‌కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు? అని గొంతెత్తి ప్రశ్నించారు. అసలు డీఎస్సీ ఎందుకు వాయిదా వేయకూడదో ప్రభుత్వం సరైన కారణాలు చెప్పాలని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు సమాధానం చెప్పడం అది వారి బాధ్యత అని గుర్తు చేశారు. అలా చేయకపోగా నిరుద్యోగులపై దమనకాండ సృష్టిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం రేవంత్ ఆనాడు రాహుల్ గాంధీని తీసుకుని అశోక్ నగర్ తిప్పినప్పుడు ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? అని ఇప్పటికే గాదరి కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.