HYDRA : హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల

హైడ్రా(HYDRA)కు భారీగా నిధులు విడుదల చేసింది సర్కార్.

Update: 2024-12-03 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRA)కు భారీగా నిధులు విడుదల చేసింది సర్కార్. హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్(Hyderabad) నగరంలోని చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పలు చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హైడ్రాకు విస్తృత అధికారాలను కట్టబెడుతూ ప్రత్యేక బిల్లును కూడా ప్రభుత్వం రూపొందించింది. 

Tags:    

Similar News