Minister Seethakka : మహిళా సమాఖ్య సభ్యులకు ఉచిత యూనిఫాం చీరలు

రాష్ట్ర సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-12 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చరిత్రలో మొదటి సారి మహిళా సమాఖ్య సభ్యుల(Women Federation Members)కు యూనిఫాం చీరలు(Uniform Sarees) పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు ఉచితంగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహిళా సంఘాల యూనిఫాం చీరల కోసం ఇందిరా మహిళా శక్తి లోగో, రంగులతో ఆకర్షణయంగా ప్రత్యేకంగా డిజైన్లను రూపొందిస్తున్నట్టు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్(SERP CEO Divya Devarajan) పేర్కొన్నారు. ఈ ప్రత్యేక చీరల డిజైన్లను నేడు మంత్రి సీతక్క(Minister Seethakka)కు తన కార్యాలయంలో చూపించారు. కాగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో వీటి రంగులు, డిజైన్లను ఫైనల్ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. మరోవైపు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరలను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ.. సీతక్కకు చూపించగా, వాటికి పలు సూచనలు చేశారు.

Tags:    

Similar News