మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ భారీ ట్విస్ట్!

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తొలుత తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం జనాల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2023-12-21 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తొలుత తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం జనాల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతమంది ఈ స్కీం బాగుందని రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంతమంది మాకు ఫ్రీ బస్సు వద్దు.. చాలా ఇబ్బంది అవుతుందంటూ ఆందోళన చేస్తున్నారు. కాగా మహిళలకు అందిస్తు్న్న ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ స్కీం కేవలం తెలంగాణ మహిళలకే వర్తిస్తుందని, రాష్ట్రానికి చెందిన వారిగా ధ్రువీకరించే ఫొటోతో కూడిన ప్రూఫ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపించాలని తెలిపింది. ఇతర రాష్ట్రాల మహిళలు తప్పకుండా ఛార్జీ పెట్టుకుని టికెట్ తీసుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఐడీల్లో ఫొటోలు అస్పష్టంగా ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చెప్పిన విషయం తెలిసిందే. 


Similar News