CM Revanth Reddy: ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశం

నారాయణ‌పేట జిల్లా (Narayanapet District) మాగనూరు (Maganur) ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison) కారణంగా 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-11-20 14:52 GMT
CM Revanth Reddy: ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నారాయణ‌పేట జిల్లా (Narayanapet District) మాగనూరు (Maganur) ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison) కారణంగా 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం ఆరగించిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఫుడ్ పాయిజన్ (Food Poison) అయినట్లుగా గుర్తించిన ఉపాధ్యాయులు, సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం మక్తల్ (Makthal) ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రస్తుతం ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయన్న హెచ్చరించారు. అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.  

Tags:    

Similar News