వైర్ మెన్, సూపర్ వైజర్ పరీక్షకు ఉచిత శిక్షణ

వైర్ మెన్, సూపర్ వైజర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-12 16:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వైర్ మెన్, సూపర్ వైజర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మింట్ కాంపౌండ్ ఆవరణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివరాలకు 7989349899, 9848258202 సంప్రదించాలని కోరారు. ప్రతి ఏటా రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ల కోసం వైర్ మెన్, సూపర్వైజర్ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఆ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 15 సంవత్సరాల నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


Similar News