ప్రభుత్వ విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ప్రభుత్వ విద్యాసంస్థలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Update: 2024-09-05 12:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ విద్యాసంస్థలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని, ఈరోజు నుండే ఇది అమల్లోకి వస్తుందని తెలియ జేశారు. అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నట్టు, విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ వాటి బిల్లులు సకాలంలో చెల్లించక విద్యుత్ కట్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని.. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు భట్టి పేర్కొన్నారు.


Similar News