సివిల్ సప్లై స్కామ్‌లో CM రేవంత్ పాత్ర: BRS మాజీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణలో జరిగిన సివిల్ సప్లై కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2024-06-12 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జరిగిన సివిల్ సప్లై కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సివిల్ సప్లై శాఖలో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రైస్ టెండర్లు, ప్యాడీ టెండర్లు రద్దు అయ్యాయా లేదా అని ప్రశ్నించారు. పౌర సరఫరాల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రివ్యూ చేయడం లేదని నిలదీశారు. సివిల్ సప్లైస్ కమిషనర్ అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అయ్యారు. తమ దగ్గర ఉన్న ప్యాడీని లిఫ్ట్ చేయాలని రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్లకు లేఖలు ఇచ్చామని తెలిపారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు మాత్రమే అడుగుతున్నారని అన్నారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన స్కామ్‌పై ప్రభుత్వం రియాక్ట్ కాకుంటే త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

 


Similar News