ఏదో చేస్తామని ఇంకేదో చేస్తున్నారు.. కాంగ్రెస్ సర్కా్‌ర్‌పై రఘునందన్ రావు విమర్శలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్‌పై అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరుపై 25 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని అంటున్నారు.. దానిమీద కేసు లేదు.. చర్యలు లేవు అని ఎద్దేవా చేశారు. హేటిరో సంస్థకు భూమిలిచ్చిన అంశంమీదా చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు.
మాజీ డీజీపీ, ప్రస్తుత టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అంశంలోనూ ఏదో చేస్తామని ఇంకేదో చేశారని సెటైర్లు వేశారు. సోమేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణితో రాష్ట్ర రైతుల జీవితాలు గందరగోళంగా మారాయి.. తాము అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని చెప్పారు.. ఇప్పటివరకు నోరు విప్పడం లేదని గుర్తుచేశారు.