ఆ విషయం మాకు కేసీఆర్ ముందే చెప్పారు.. బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉన్నదని అన్నారు.

Update: 2024-02-03 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉన్నదని అన్నారు. ఆదివాసీలకు రేవంత్ క్షమాపణ చెప్పడం కాదు సోనియా, రాహుల్, ఖర్గేతో చెప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం భాషను అందరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కళ్లుండి చూడలేని కబోది రేవంత్ అని విమర్శించారు. విష జ్వరాలతో బాధపడే ఆదివాసి గూడాలు, తండాల్లో వైద్య సదుపాయాలు కల్పించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎవరూ చెప్పలేదని.. అనవసరంగా రేవంత్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. గౌరవంగా, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. అయినా రేవంత్ రెడ్డిలో అభద్రతా భావం పెరిగిపోతోందని అన్నారు.

కాంగ్రెస్ అధిష్టానం నుంచి, సీనియర్ల నుంచి పదవీ గండం ఉందని రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే అసహనంగా మాట్లాడుతున్నారని తెలిపారు. హడావుడిగా రెండు గ్యారంటీలు అమలు చేసి.. మిగిలినవి మర్చిపోయారని అన్నారు. కానీ, తాము మర్చిపోనివ్వమని.. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. రేవంత్ పాలన రాక్షస రాజ్యం అయిందనీ కీలక అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను బూతులు తిట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి పెద్దోడు అయిపోడు అని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లిపై కపట ప్రేమ చూపించడం కాదని.. దమ్ముంటే అమరవీరుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News