CM రేవంత్‌కు టచ్‌లో 10 మంది BRS ఎమ్మెల్యేలు: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర
దిశ, వెబ్‌డెస్క్: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన కాంగ్రెస్ శ్రేణులకు గులాబీ బాస్‌కు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మాడి మసైపోతారని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని షాకింగ్స్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధమని సీరియస్ అయ్యారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయకుండా మధ్యలోనే డ్రాప్ అవుతారని.. అందుకే కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు.
Read More...
బీజేపీ, ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్