Malla Reddy : ‘కుటుంబ సమేతంగా రావాలి’ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా తన మనవరాలి వివాహానికి రావాలని పెళ్లి పత్రికను సీఎంకు మల్లారెడ్డి అందించారు. సీఎంతో పాటు మల్లారెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మల్లారెడ్డి కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీ సీఎంతో తీగల కృష్ణారెడ్డి సైతం ఉన్నారు. ఇదిలా ఉండగా మల్లారెడ్డి అల్లుడు అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు.