బుచ్చమ్మ ది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి చేసిన హత్య: మాజీ మంత్రి కేటీఆర్

సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR).. హైడ్రా బాదితుల(Hydra victim)ను పరామర్శించారు.

Update: 2024-10-28 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR).. హైడ్రా బాదితుల(Hydra victim)ను పరామర్శించారు. ఇందులో భాగంగా.. హైడ్రా(Hydraa) అధికారులు తన ఇంటిని కూల్చివేస్తారనే భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అలాగే వారికి అండగా ఉంటామని ధైర్యం చేప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని..సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన హత్యనే అంటూ మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని నగర ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టాడని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే హైదరాబాద్(Hyderabad) ప్రజలకు తాము అన్ని రకాలుగా అండగా ఉంటామని, హైడ్రాపై న్యాయ పోరాటం(Legal fight) చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు.


Similar News