Koppula Eshwar: ఇలాంటి వ్యక్తిని తొలిసారి చూస్తున్నా..

అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఆరోపించారు.

Update: 2025-03-15 15:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రజల మధ్యన పలుచనైపోయానని తెలిసి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు సమాధానం చెప్పే శక్తి లేక ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. సుదీర్ఘ ఉపన్యాసంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు తప్పితే ఏమీ లేదని తెలిపారు. కేసీఆర్‌ ప్రతిపక్ష నాయకుడని, ఆయనను అగౌరవ పరచడం సరికాదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి విజ్ఞత, సంస్కారం లేకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడారని తెలిపారు. ఇంతటి నీచపు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News