‘ఎన్ని కమిషన్లు వేసినా నో ప్రాబ్లమ్’.. కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-06-12 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

రైతుల రూ.2 లక్షల రుణమాఫీపై ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోన్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం నిందలా..? అని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ చేసేవన్నీ పసలేని ఆరోపణలుగా తేలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కమిషన్లు వేసిన మాకు అభ్యంతరం లేదని జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ప్రభుత్వం మొదటగా రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.  


Similar News