Harish Rao : చంద్రబాబుపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించారు. కరీంగనర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విజభన ప్రకారం గడువు ముగిసినా.. హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారని, ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ఇక, హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీ మాత్రమే అమలు చేసి.. అన్ని అమలు చేసినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలన్న, తెలంగాణలో గళం పార్లమెంట్‌లో వినిపించాలన్న బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం హైదరాబాద్‌పై ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాజాగా హరీష్ రావు ఇవే తరహా కామెంట్స్ చేయడంతో హైదరాబాద్ రాజధాని వ్యహహరం మరోసారి చర్చనీయాంశంగా మారింది.