ముఖ్యమంత్రి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు: హరీష్ రావు
భోగి పండుగ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట అభివృద్ధిని చూడటానికి ప్రజలు ఎక్కడినుంచో వస్తున్నారని అన్నారు.
దిశ, వెబ్డెస్క్: భోగి పండుగ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట అభివృద్ధిని చూడటానికి ప్రజలు ఎక్కడినుంచో వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో అద్భుతమైన గుణాత్మక మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఇంకా పదిశాతం మంది జనాల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లాకు ఇప్పటివరకు 22 అవార్డులు వచ్చాయని చెప్పారు.
రాష్ట్రానికి అవార్డు వస్తే కనీసం ముఖ్యమంత్రి, మంత్రులు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలన్నీ బ్రహ్మండంగా అభివృద్ధి చెందాయని అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ప్రస్తుతం గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు నెలరోజుల్లోనే అసహనం కలుగుతోందని తెలిపారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడ్ని చేజేతులా ఓడించుకున్నామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.