యాదాద్రి, మూసీ విషయంలో రేవంత్ సంచలన సవాల్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు
యాదాద్రి, మూసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన సవాల్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచారు..
దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లా పర్యటనలో మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వెళ్లిన యాదాద్రి ఆలయం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former Cm Kcr) కట్టిందేనని ఆయన గుర్తు చేశారు. మూసీకి కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచే నీళ్లు ఇవ్వాలని చెప్పారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వారా అని హరీశ్ రావు నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోందని, పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని విమర్శించారు. హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టడమే రేవంత్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తాము భయపడమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
అయితే యాదాద్రి జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్ నేతలకు సంచలన సవాల్ విసిరారు. మూసీ అభివృద్ధికి 30 రోజుల్లో డిజైన్లు రెడీ అవుతున్నాయని, జనవరి నెలలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నానని, దమ్ముంటే ఆపే ప్రయత్నం చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.