బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు

మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు మాజీ ఎమ్మెల్యే శంకర్న ధోంగే నేతృత్వంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Update: 2023-04-10 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు మాజీ ఎమ్మెల్యే శంకర్న ధోంగే నేతృత్వంలో బీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం ప్రగతిభవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు చెందిన నేతలకు గులాబీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే, మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే భర్త విజయ్ థోంబరే, ముఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జడ్పీ మెంబర్ శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటె, మాజీ జడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ, ఎన్సీపీ, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్ ధోంగే తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News