‘పేదల విద్యను ధ్వంసం చేయడమే KCR టార్గెట్’
కేసీఆర్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వం అని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శలు గుప్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వం అని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శలు గుప్పించారు. పేదలకు సంబంధించిన విద్యను ధ్వంసం చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశం అని విరుచుకుపడ్డారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ఒరిగేది ఏమీ లేదని శుక్రవారం మండిపడ్డారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం టీమ్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ భూపేష్ గుప్తా నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శిచినట్లు తెలిపారు.
ఈ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం మొదలై సంవత్సరం దాటినా ఎలాంటి మార్పు లేదన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో బాత్ రూమ్ లు, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవని ఈ స్కూల్ కు రూ.14 లక్షలు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు కాలేదని ఆరోపించారు. ఈ పథకం కింద మొదటి విడతలో రాష్ట్రావ్యాప్తంగా రూ.3,497.62 కోట్లు వెచ్చించి 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నిన్న SDF టీం సరూర్ నగర్ భూపేష్ గుప్త నగర్ లో 300 పిల్లలు ఉన్న ప్రాధమిక పాఠశాల visit చేసాము.చెత్తగా ఉంది ఆవరణంతా
— Murali Akunuri (@Murali_IASretd) April 21, 2023
మనఊరు మనబడి మంజూరు అయ్యి సంవత్సరం అయ్యింది ఒక్క రూపాయి ఖర్చు కాలేదు
KCR ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వం.
పేదలకు సంబందించిన విద్యను ధ్వంసం చేయడమే ఆయన ఉద్దేశ్యం. pic.twitter.com/fi9wcRYB8r