సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ మాజీ గవర్నర్ భేటీ (వీడియో)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-01-06 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే. మరో నాలుగు గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తొంది. ఇందుకోసమే అభయహస్తం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం చేపట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు 20 లక్షల అర్జీలు వచ్చాయి. ఇంత గొప్పగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజాపాలన నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మాజీ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సీఎం రేవంత్ రెడ్డిని డా. బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో వస్తున్న మార్పులపై నరసింహన్ ప్రశంసించారు. అనంతరం వీరిద్దరు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారని సమాచారం. అలాగే నరసింహన్ రాష్ట్రంలోని పరిస్థితులపై రేవంత్‌కు సలహాలు, సూచనలు అందించారని తెలుస్తోంది. గత నెలలో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సీఎంను కలవగా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి అమితంగా సపోర్టు చేసిన నరసింహన్ రేవంత్ రెడ్డిని కలవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై కొందరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మార్పులు చేస్తున్న తరుణంలో, నరసింహన్‌కు ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


Similar News