మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు మొదలయ్యయని.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతన్నారని.. భట్టి ఫైర్ అయ్యారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని.. అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి, అన్ని వర్గాల ప్రజలకు వనరులు, సంపద దక్కడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
కాగా పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్న కేసీఆర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని.. సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేసీఆర్ విమర్శింస్తున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి ఈ రోజు తనదైన శైలిలో బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు
Read More...
సీఎం రేవంత్ రెడ్డి మాదిగ జాతి ఎదగకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు: మోత్కుపల్లి