ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసమ్మతి
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసమ్మతి నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరారు. తాజాగా బీఆర్ఎస్కు సూర్యాపేట జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చందర్రావు సహా పలువురు కోదాడకు చెందిన బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. బీఆర్ఎస్లో ఇమడలేకనే రాజీనామాలు చేసినట్లు తెలిపారు. రేపు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీరందరూ కాంగ్రెస్‌లో చేరనున్నారు.