‘యాసంగి పంట చేతికి వచ్చే నాటికి రైతులకు గుడ్ న్యూస్ చెప్పాలి’
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని మండిపడ్డారు. వరి కొనుగోలు డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బోనస్‌తో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుబంధు అంశాన్ని ప్రభుత్వం పరిహాసం చేస్తోందని సీరియస్ అయ్యారు. గోదావరి బేసిన్‌లో యాసంగి సాగుకు నీరు ఇస్తారో లేదో చెప్పాలనీ డిమాండ్ చేశారు. యాసంగి పంట చేతికి వచ్చే నాటికి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. వరంగల్, ఖమ్మం మిర్చీ యార్డుల్లో ధరలు పడిపోయాయని అన్నారు. ప్రభుత్వం నియంత్రించి ధరలు తగ్గకుండా చూడాలని తెలిపారు.