కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆడియో వైరల్ వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్!
సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయాల్లో రంజుగా మారాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయాల్లో రంజుగా మారాయి. తమ సత్తా ఎంటో చాటుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలకు తమ నేతల ఆడియో క్లిప్పింగ్ ల లీకులు టెన్షన్ గా మారాయి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తిట్లదండకానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగులు లీకు కాగా అవి తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆడియో క్లిప్పింగ్ లపై రచ్చ కొనసాగుతుండగానే తాజాగా తెరపైకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆడియో వైరల్ గా మారింది. కేసీఆర్ ను వాడు అంటూ సంభోధింస్తూ బూతులతో రెచ్చిపోయిన మాటలు ఆ క్లిప్పింగ్ లో ఉన్నాయి.
నిజానికి ఈ ఆడియో క్లిప్పింగ్ పాతదే అయినా తాజాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ మద్దతుదారులు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మద్దతు దారులు పొన్నం ఆడియో క్లిప్పింగ్ లను వైరల్ చేస్తే దానికి కౌంటర్ గా కాంగ్రెస్ సింపతైజర్లు రసమయి బూతు పురాణాన్ని తెరపైకి తీసుకువస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య. ఆడియో లీకుల రాజకీయం రసవత్తరంగా ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
అధికారం లేకుంటే ఇవీ.. మీ బతుకులు..
— Aapanna Hastham (@AapannaHastham) March 25, 2024
పవర్ పోతే పార్టీలో కూడా మర్యాద లేేకపాయే#BRS pic.twitter.com/YnAuwdu1x1