'యాదాద్రి'కి.. రికార్డ్ స్థాయిలో 'హుండీ' ఆదాయం

యాదాద్రి ఆలయానికి గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. అందువల్ల హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది.

Update: 2024-08-07 15:23 GMT

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి ఆలయానికి గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. అందువల్ల హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రెండున్నర కోట్లకు పైగా నగదు సమకూరినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు 30 రోజులుగా సమర్పించిన నగదు, నగల కానుకలను ఆధ్యాత్మిక వాడలోని శ్రీ సత్యనారాయణ వ్రత మండపంలో బుధవారం లెక్కించారు. గడిచిన 30 రోజుల్లో స్వామి వారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 66 లక్షల 68 వేల 787 లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్వామి వారికి వచ్చిన ఆదాయంలో విదేశీ కరెన్సీ కూడా ఉందని.. వాటిలో అత్యధికంగా 1354 అమెరికన్ డాలర్లు, ఇంకా యూఏఈ దిర్హమ్స్, సౌదీ రియాల్స్ తో పాటూ.. పలు దేశాల కరెన్సీ కూడా ఉన్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.


Similar News