బీజేపీలో చేరిన MP రాములు ఫస్ట్ రియాక్షన్

బీజేపీ చేరడం సంతోషంగా ఉందని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు అభిప్రాయపడ్డారు. గురువారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో రాములు తన కుమారుడు భరత్‌తో కలిసి బీజేపీలో చేరారు.

Update: 2024-02-29 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ చేరడం సంతోషంగా ఉందని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు అభిప్రాయపడ్డారు. గురువారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో రాములు తన కుమారుడు భరత్‌తో కలిసి బీజేపీలో చేరారు. వారికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడారు. నా నియోజకవర్గ అభివృద్ధితో పాటు దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ, అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నా కుమారుడు భరత్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని అన్నారు. రాములే కాదని మరికొంతమంది పార్టీలో చేరబోతున్నారని ప్రకటించారు.

రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుచుకునే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ని గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులనెలా సమకూర్చుకుంటారో బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400లకు పైగా సీట్లను గెలుస్తుందని.. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News