మొదట మాజీ నక్సలైట్.. ఆ తర్వాతే మంత్రి పదవి.. ట్విట్టర్ అకౌంట్‌లో సీతక్క మార్క్

ప్రతి ఒక్కరూ తమ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తాము చేసే పనిని పేరు కింద మెన్షన్ చేయడం చూస్తుంటాం.

Update: 2024-07-21 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ తమ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తాము చేసే పనిని పేరు కింద మెన్షన్ చేయడం చూస్తుంటాం. పేరు కింద చూసే క్వాలిఫికేషన్, హోదాతో చాలా మందికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రి, నుంచి చైర్మన్లు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల పేర్ల కింద మనం వారి వారి హోదాలను చూస్తుంటాం. అయితే మంత్రి సీతక్క మాత్రం తన మార్క్‌ను ట్విట్టర్ హ్యాండిల్‌లో చాటుకున్నారు. ‘మాజీ నక్సలైట్’ పదాన్ని మొదట పేర్కొన్న మంత్రి సీతక్క తన చదువు, మంత్రి పదవిని తర్వాత పేర్కొనడం విశేషం.

మాజీ నక్సలైట్, ఎంఏ, పీహెచ్‌డీ, అడ్వకేట్, ప్రస్తుత ఎల్ఎల్‌ఎం విద్యార్థి, తెలంగాణ కేబినెట్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ఆర్‌డబ్ల్యూఎస్, మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అని సీతక్క ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు సీతక్క అణగారిన వర్గాల్లో చైతన్యం కోసం పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. 1988లో అడవిబాట పట్టి నక్సలైటుగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేశారు. 

Tags:    

Similar News