సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్ని ప్రమాదం

సిద్ధిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డంపింగ్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి.

Update: 2023-05-27 08:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: సిద్ధిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డంపింగ్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం ఫైర్ స్టేషన్‌కు తెలియజేయడంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలార్పుతున్నారు. విపరీతమైన ఎండల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో అక్కడక్కడ మంటలు చెలరేగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం అగ్ని ప్రమాదం సంభవించినా ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..