ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్ కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Update: 2024-09-30 13:41 GMT

దిశ, ముషీరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలని లేనట్లయితే సచివాలయం ముట్టడి తో పాటు, రాష్ట్రాన్ని నిర్బంధిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా స్కాలర్షిప్ నిధులు పెంచకుండా మంత్రులు రాష్ట్రంలో తిరిగితే ఎక్కడికక్కడ అడ్డుకోవాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సోమవారం చేపట్టిన మహా ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తో పాటు పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తయిన సర్టిఫికెట్లు రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సర్టిఫికెట్లు, ఫీజు బకాయిలు రాక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, ఉద్యోగాలు పొందలేక ఆందోళన గురవుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో 20 వేలు, 15 వేలు స్కాలర్షిప్లు ఇచ్చి విద్యార్థులకు పెద్దపీట వేస్తుంటే మన రాష్ట్రంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 5500 స్కాలర్షిప్ ఇస్తూ చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, అంజి, సత్యం, రామకోటి, రాజేందర్, ప్రభాకర్, కోటీశ్వరి, నందగోపాల్ తదితరులతోపాటు విద్యార్థులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.


Similar News