ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం
ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దిశ, జనగామ: ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామం వద్ద చోటు చేసుకుంది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉలుచనూరుకు చెందిన అంబటి శ్రీను, నాగమణి, అంబటి ప్రశాంత్, సింధుజ కుటుంబ సభ్యులు నలుగురు పాలకుర్తి మీదుగా కారులో జనగామ వైపు వస్తున్నారు.
మీరు ప్రయాణిస్తున్న టిఎస్13ఈసి7426 ఎర్టిగా కారు కుందారం గ్రామ సమీపంలోకి చేరుకున్నాక అతి వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున్న సింధుజ(22) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారును నడిపిన వ్యక్తి ప్రశాంత్‌కు, ఆయన తండ్రి శ్రీనివాస్ తల్లి నాగమణిలో కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 లో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.