NZB: మక్లూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీ కొట్టింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ వివరాల ప్రకారం. డొంకేశ్వర్‌కు చెందిన ప్యాసింజర్ ఆటో 8 మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని నిజామాబాద్‌కు వస్తోంది. నిజామాబాద్ నుంచి బియ్యం బస్తాలు తీసుకొని నందిపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోతో పాటుగా బొలెరో వాహనం పల్టీ కొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 8 మంది ప్యాసింజర్లు ఆటో డ్రైవర్, తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ క్షతగాత్రులను ప్రత్యేక వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు. బొలెరో వాహనం డ్రైవర్ అతివేగగా, నిర్లక్ష్యంగా నడపడమే ఈ ఘటనకు కారణమని ఎస్ఐ తెలిపారు. క్షతగాత్రులలో మహిళలు కూడా ఉన్నారు.