పచ్చిరొట్ట విత్తనాలు కోసం రైతులకు తిప్పలు.. అధికారుల తీరుపై అసహనం

వర్షాకాలం ఖరీఫ్ పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.

Update: 2024-05-29 06:54 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: వర్షాకాలం ఖరీఫ్ పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా భూసారాన్ని పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట ఎరువులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

బుధవారం జగిత్యాల పట్టణంలోని బీట్ బజారు వద్ద గల ఆగ్రో సెంటర్ ముందు రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఉదయం నుండి లైన్లలో ఉన్న రైతులు ఎండ వేడికి తాళలేక క్యూ లైన్స్‌లో పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను ఉంచారు. అయితే పచ్చిరొట్ట విత్తనాల కొరకు ఈ సారి కొత్తగా ఏఓ సంతకం అడుగుతున్నారని, ఎన్ని చోట్లకు తిరగమంటారు అంటూ కొందరు రైతులు వ్యవసాయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విత్తనాలు సరిపడా ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ తండోప తండాలుగా రైతులు తరలివస్తున్నారు.


Similar News