VC Sajjanar : ఈజీ మనీ వలలో పడితే జీవితాలు నాశనమే : వీ.సీ.సజ్జనార్
కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని, ఈజీ మనీ(Easy Money)కోసం ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)కు వ్యసనపరు(Addictive)లై జీవితాలను ఛిద్రం(Ruining Lives) చేసుకోవద్దని సీనియర్ ఐపీఎస్, టీజీఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (V.C. Sajjanar)ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
దిశ, వెబ్ డెస్క్ : కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని, ఈజీ మనీ(Easy Money)కోసం ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)కు వ్యసనపరు(Addictive)లై జీవితాలను ఛిద్రం(Ruining Lives) చేసుకోవద్దని సీనియర్ ఐపీఎస్, టీజీఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (V.C. Sajjanar)ఎక్స్ వేదికగా హెచ్చరించారు. తన పోస్టులో ఆన్ లైన్ మోసాలకు గురైన వార్తలను షేర్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తోందని..ఎంతో మంది అమాయకులు తమకు తెలియకుండానే బెట్టింగ్‌కు వ్యసనపరులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా బెట్టింగ్‌కు ఆకర్శితులవుతున్నారని, చిత్ర విచిత్ర మాటలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని, వారి మాటలు నమ్మి ఈ బెట్టింగ్ యాప్‌లను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసి భారీ మొత్తంలో కూరుకుపోతున్నారని సజ్జనార్ వెల్లడించారు.
తమ స్వార్థం కోసం ఇతరులను బెట్టింగ్‌లోకి ఇన్‌ఫ్లుయెన్సర్లు లాగుతున్నారని, అరచేతిలో వైకుంఠం చూపించే సంఘ విద్రోహ శక్తుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్ వల్ల ఇబ్బందులు పడుతుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు. బెట్టింగ్ బాధితులు మౌనంగా ఉండటం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, మీరు దైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అవడంతో పాటు ఇతరులు బెట్టింగ్ వైపునకు ఆకర్షితులు కాకుండా చేయవచ్చని తెలిపారు.