యూపీఎస్సీ టాపర్ అనన్యపై ఫేక్ ఖాతాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. సివిల్స్‌లో పాలమురు బిడ్డ సత్తా చాటడంతో ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల సన్మానం చేశారు. అయితే సోషల్ మీడియాలో తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాల విషయంలో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం కోరింది.
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరుపై నకిలీ ఖాతాలు సృష్టించారని ఆమె తెలిపారు. మరోవైపు కొన్ని ఛానెల్‌లు తన పేరు మీద మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయని, ఉద్యోగార్ధుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నాయని తను ఆరోపించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27న అనన్య ఫిర్యాదు చేశారు.
Read More...
అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్