తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది.
దిశ, వెబ్ డెస్క్: మంగళవారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోయాయి. దీంతో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఉదయం 8 కావొస్తున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలికి తోడు దట్టమైన పొగమంచు(Dense fog) కురుస్తుండటంతో.. రోడ్లపై వెళ్లే వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో నగరంలోని చాలా రహదారులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో(agency areas) అయితే తెల్లవారుజామున 10 గంటలు అవుతున్న మంచు దుప్పట్లు వదలక పోవడం తో దూరప్రాంతాలకు వెళ్లే.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలైతే.. ఉదయం 10 గంటలు దాటితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. చలి తీవ్రత(Cold intensity) పెరగడంతో గ్రామాల్లో ఎక్కడ చూసిన రోడ్ల వెంట చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఈ రోజు అత్యల్పంగా.. పటాన్‌చెరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగా రానుంది. ఈ పండుగ అనంతరం చలి తీవ్రత కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. దీంతో అప్పటి వరకు గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.