TG: కులగణనపై సర్కార్ దూకుడు.. నెల రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్
తెలంగాణ(Telangana)లో కులగణన(caste enumeration) విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో కులగణన(caste enumeration) విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కుల గణన కోసం అసెంబ్లీ(Assembly)లోనూ తీర్మానం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, కులగణన పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రోజు రోజుకీ సర్పంచ్ ఎన్నికలు ఆలస్యమవుతుండటంతో.. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కుల గణన పూర్తి చేసి కొత్త రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం.. స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆసల్యం అయ్యే అవకాశం ఉంది. మూడు నెలల్లో కులగణన పూర్తయినప్పటికీ.. ఎన్నికలు జరిపేందుకు సుమారు 6 నెలలు పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కుల గణన పూర్తయిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.