కాపు కాసి వెంటాడిన పోలీసులు.. సినిమాల్లో కూడా ఈ రేంజ్ చేజింగ్ చూడలేదేమో..!

తెలంగాణను డ్రగ్స్, గంజాయి ఫ్రీ స్టేట్‌గా మార్చాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకున్నది. రోజూ అనుమానం వచ్చిన ప్రతీ చోటా విస్తృతంగా తనిఖీలు చేస్తూ గంజాయి అమ్మకం దారులను, కొనుగోలు దారుల భరతం పడుతున్నారు.

Update: 2024-08-16 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను డ్రగ్స్, గంజాయి ఫ్రీ స్టేట్‌గా మార్చాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకున్నది. రోజూ అనుమానం వచ్చిన ప్రతీ చోటా విస్తృతంగా తనిఖీలు చేస్తూ గంజాయి అమ్మకం దారులను, కొనుగోలు దారుల భరతం పడుతున్నారు. తాజాగా.. డ్రగ్స్ ముఠా కోసం నల్లగొండ జిల్లా ఎక్సైజ్ పోలీసులు సినిమాను మించిన రేంజ్‌లో చేజింగ్ చేశారు. గంజాయి బ్యాచ్ కోసం కాపు కాసి.. వెంబడించి మరీ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం నల్లగొండ ఎక్సైజ్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కాపు కాశారు.

దూరం నుంచే పోలీసులను, వారి వాహనాలను గమనించిన ముఠా అటునుంచి అటే పారిపోయే ప్రయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కాలనీలోకి ప్రవేశించడాన్ని గమనించి తనిఖీలు చేశారు. చివరకు పోలీసుల కంటబడి పోలీసుల వాహనాన్నే బలంగా ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసుల సాయంతో ముఠాను నిలువరించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా కారు ఢీకొని కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. అనంతరం వారిని నల్లగొండకు తరలించారు. కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News