Excise police : శంషాబాద్‌లో ఎక్సైజ్ పోలీసుల దాడులు
శంషాబాద్(Shamshabad)లో ఎక్సైజ్ పోలీసు(Excise police)ల దాడులలో భారీగా డ్యూటీ ఫ్రీ లిక్కర్(Duty-free liquor) మద్యం పట్టుబడింది. దాడులలో రూ. 15 లక్షల విలువైన డ్యూటీ ఫ్రీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : శంషాబాద్(Shamshabad)లో ఎక్సైజ్ పోలీసు(Excise police)ల దాడులలో భారీగా డ్యూటీ ఫ్రీ లిక్కర్(Duty-free liquor) మద్యం పట్టుబడింది. దాడులలో రూ. 15 లక్షల విలువైన డ్యూటీ ఫ్రీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితుల్లో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్(RGI) కానిస్టేబుల్ జెమ్యా నాయక్, హోంగార్డు లింగయ్యలు కూడా ఉండటం గమనార్హం. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు.
నిందితుల నుంచి 3 కార్లు, 50 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో లభించే డ్యూటీ ఫ్రీ లిక్కర్ విదేశీ మద్యంతో నిందితులు తమ అక్రమ దందా సాగిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు.